కర్నాటకలో హై ప్రొఫైల్ వెడ్డింగ్ లో శ్రీలీల లుక్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువనగౌడ, వ్యవస్థాపకురాలు నిఖిత జంట వివాహంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి శ్రీలీల సందడి చేసింది. ఈ పెళ్లిలో శ్రీలీల సాంప్రదాయబద్ధమైన చీరకట్టులో కనిపించింది. ఖరీదైన డిజైనర్ శారీ, నడుముకు వడ్డానం, మెడలో భారీ ఆభరణం, ఖరీదైన యాక్ససరీస్ ధరించిన శ్రీలీల కళ్లకు గాగుల్స్ ధరించి స్మైలీ లుక్ లో కనిపించింది. నీల్ అతడి భార్య మధ్యలో శ్రీలీల ఫోజులు ఇవ్వగా, ఈ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
భువనగౌడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి అత్యంత సన్నిహితుడు. నీల్ తెరకెక్కించిన మొదటి సినిమా ఉగ్రంకి అతడే సినిమాటోగ్రాఫర్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రాలకు అతడు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీకి భువనగౌడ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
భారతదేశంలో అరుదైన సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ తో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసే, అత్యుత్తమ సాంకేతిక నిపుణుడిగా భువనగౌడకు గుర్తింపు ఉంది. కేజీఎఫ్, సలార్ ఫ్రాంఛైజీలకు అతడి సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. అతడు దాదాపు అరడజను పైగా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.