ఇది నిజంగా ఆశ్చర్యకరమే అయినా.. అతడి ఫాలోయింగ్ అంతకు ఏమాత్రం తక్కువ కాదు. పాపులర్ హాలీవుడ్ స్టార్, అందగాడు చార్లీ షీన్ తన జీవితంలో ఇప్పటివరకూ దాదాపు 47000 మందితో శృంగారం చేసానని చెప్పడం ఆశ్చర్యపరిచింది. నిజానికి ఒకరు తన జీవితకాలంలో ఎంతమందితో శృంగారంలో పాల్గొనగలరు? అన్నదానికి చారిత్రక ఆధారం ప్రకారం... చెంఘీజ్ ఖాన్ లాంటి ముస్లిమ్ చక్రవర్తి ప్రపంచవ్యాప్తంగా వందలాది స్త్రీలను బలవంతంగా లోబరుచుకున్నాడని చరిత్ర చెబుతోంది. అతడి వారసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వారసత్వాన్ని అందించారు. వారి పిల్లలు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. కానీ వారి తాత చెంఘీజ్ ఖాన్ అని నేటి జనరేషన్ కి తెలియకపోవచ్చని చరిత్రకారులు, కాలమిస్టులు పేర్కొన్నారు.
కానీ ఒక స్టార్ చెంఘీజ్ ఖాన్ ని మించిపోయాడా? చక్రవర్తులను మించి బలాత్కారం చేయగలిగాడా? ఇతగాడు ఒక స్టార్ గా తనకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని ఇంతమందితో శృంగారంలో పాల్గొన్నాడా? ఇలాంటి ఎన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇది మాత్రమే కాదు షీన్ కొందరు మగవాళ్లతో కూడా శృంగారం చేసానని అంగీకరించడం షాకిచ్చింది.
హాలీవుడ్ స్టార్లలో విశృంఖలత గురించి అపరిమిత కథనాలు ఆశ్చర్యపరుస్తున్నా నటుడు షీన్ అన్ని పరిమితుల్ని దాటిపోయాడు. దశాబ్ధాల కాలంగా హాలీవుడ్ ప్రముఖ బ్యానర్లతో సత్సంబంధాలు కొనసాగించిన షీన్ కెరీర్ లో ఎన్నో క్లాసిక్ అనదగ్గ చిత్రాల్లో నటించాడు. అతడు ఆస్కార్ అవార్డ్ గ్రహీతగాను పాపులరయ్యాడు. తాజాగా లోగన్ పాల్ ఇంపల్సివ్ పాడ్ కాస్ట్ లో తన జీవితంలోని రహస్యాలను బహిర్గతం చేసాడు. నాది టైగర్ బ్లడ్.. దాని దూకుడు వేరుగా ఉంటుందని కూడా తన గురించి తాను ఛమత్కరించాడు. ది త్రీ మస్కటీర్స్, ది ఛేజ్, ది వాల్ స్ట్రీట్, ది అరైవల్, హాట్ షాట్స్, స్కారీ మూవీ 3 బ్లాక్ బస్టర్ చిత్రాలలో అతడు నటించాడు.