Advertisement
Google Ads BL

తండ్రిని త‌ల‌చుకుని.. స్టార్ డిజైన‌ర్ ఎమోష‌న‌ల్


`మ‌నం` అక్కినేని న‌టించిన చిట్ట‌చివ‌రి సినిమా. లెజెండ‌రీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న జీవితంలో చివ‌రి రోజు వ‌ర‌కూ న‌టిస్తూనే ఉన్నారు. అలాంటి అంకిత‌భావం కొంద‌రికి మాత్ర‌మే సాధ్యం. అయితే అక్కినేని త‌ర‌హాలోనే గొప్ప క‌మిట్ మెంట్ తో చివ‌రి రోజు వ‌ర‌కూ  ఎంచుకున్న (హెయిర్ డిజైన్) రంగంలో త‌న ఉనికిని చాటుకున్న ఒక గొప్ప‌ వ్య‌క్తిని మీకు ప‌రిచ‌యం చేయాలి.

Advertisement
CJ Advs

అత‌డి పేరు హ‌కీమ్ కైర్వాణీ. ప్ర‌ఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీమ్ తండ్రి. బాలీవుడ్ స్వ‌ర్ణ‌యుగాన్ని ఏలిన సూప‌ర్ స్టార్ల‌తో క‌లిసి అత‌డు ప‌ని చేసారు. అమితాబ్ బ‌చ్చ‌న్, శ‌శిక‌పూర్, సునీల్ ద‌త్ వంటి వారికి వ్య‌క్తిగ‌త హెయిర్ డిజైన‌ర్ గా ప‌నిచేసారు. అయితే హ‌కీమ్ కైర్వాణీ త‌న చివ‌రి రోజు వ‌ర‌కూ త‌న వృత్తిలో నిమ‌గ్న‌మై ఉన్నారో ఆలిమ్ హ‌కీమ్ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ తో రెండో సినిమా నుంచి చివ‌రి సినిమా వ‌ర‌కూ అత‌డికి వ్య‌క్తిగ‌త డిజైన‌ర్ గా కైర్వాణీ ప‌ని చేసారు.

ఒక రోజు `మ‌ర్ద్` షూటింగ్ స్పాట్ లో అమితాబ్ కి కంటిన్యూటీ హెయిర్ ని డిజైన్ చేస్తుంటే అక‌స్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రిలో చేర్చాక మ‌రుస‌టి రోజు మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని గుర్తు చేసుకున్న ఆలిమ్ హ‌కీమ్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న తండ్రి చివ‌రి రోజు వ‌ర‌కూ వృత్తికి ఎలా అంకిత‌మ‌య్యారో స్క్రీన్ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

ర‌జ‌నీకాంత్, నాగార్జున, షారూఖ్, హృతిక్, ర‌ణ‌బీర్ స‌హా ఎంద‌రో దిగ్గ‌జ హీరోల‌కు ఆలిమ్ హ‌కీమ్ హెయిర్ స్టైలిస్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. తండ్రి వార‌స‌త్వ వృత్తిని స్వీక‌రించి గ్లామ‌ర్ రంగంలో డిజైన‌ర్ గా కొన‌సాగుతున్నారు. ఆలిమ్ హ‌కీమ్ హెయిర్ సెలూన్ లు దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్. ముంబై నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఆలిమ్ హ‌కీమ్ హెయిర్ సెలూన్ ల‌ను విస్త‌రించ‌డం ఒక చ‌రిత్ర‌.

Aalim shared an emotional memory about his father final moments:

Aalim also shared a deeply emotional memory of his father final day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs