అక్టోబర్ 30 న నారా రోహిత్ వివాహం జరగనున్న విషయం తెలిసిందే. పెళ్ళికి ముందు నారా రోహిత్ తాను వివాహమాడబోయే శిరీష తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యకమాల్లో నిన్న శనివారం హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రవేట్ రిసార్ట్ లో హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇక ఈ రోజు ఆదివారం నారా రోహిత్ పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ సతీ సమేతంగా హాజరయ్యారు. భార్య వసుందర తో కలిసి నారా రోహిత్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో బాలయ్య సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక నారా రోహిత్ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.