కొద్దిరోజులుగా రష్మిక ను చూస్తే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తొచ్చి అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రష్మిక-విజయ్ దేవరకొండలు సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న విషయం మీడియాకి పొక్కింది. ఈమధ్యనే థామా రిలీజ్ ప్రమోషన్స్ లో సందడి చేసిన రష్మిక ఆ వెంటనే గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లోకి దిగిపోయింది.
రీసెంట్ గా హైదరాబాద్ లో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం వచ్చిన రష్మిక కొన్నాళ్లుగా మాస్క్ పెట్టుకుని తిరగడం పై ఆమె ఫేస్ కి ఏదో అయ్యింది అనే సందేహాలు ఎక్కువయ్యాయి. అయితే రష్మిక ముక్కు కి సర్జరీ చేయించుకోవడం వలనే ఆమె బయట ఎక్కువగా మాస్క్ లో కనిపిస్తుంది అని తెలుస్తుంది. ఇకపోతే గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ కాబోయే వాడి గురించి రశ్మికను అడగగానే గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు విజయ్ దేవరకొండ పేరు చెబితే రష్మిక హావభావాలతో నవ్వేసి తమ ప్రేమను కన్ ఫర్మ్ చేసింది.
ఇకపోతే సోషల్ మీడియాలో రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో రష్మిక ను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కిర్రాక్ లుక్ లో రష్మిక చాలా బ్రైట్ గా కనిపించింది. మెడలో యాంటిక్ జ్యువలరీతో మెరిసింది. రష్మిక ఫ్రెష్ లుక్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.