Advertisement
Google Ads BL

మలయాళ మిరాజ్ మినీ రివ్యూ


మలయాళ మిరాజ్ మినీ రివ్యూ 

Advertisement
CJ Advs

మళయాళంలోనే కాదు ఏ భాషలో అయినా థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. మలయాళంలో జీతూ జోసెఫ్ లాంటి దర్శకులు ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కిస్తారు. దృశ్యం సీరీస్ లో రెండు భాగాలూ జీతూ జోసెఫ్ అలాంటి ట్విస్ట్ లతోనే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసారు. అదే డైరెక్టర్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన మిరాజ్ చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. ఇప్పుడు ఓటీటీ లోను మిరాజ్ అద్దరగొట్టేస్తుంది. సోని లివ్ ఓటీటీ వేదికగా తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మిరాజ్ మినీ రివ్యూలోకి వెళితే.. 

మిరాజ్ మినీ స్టోరీ:

రాజశేఖర్ నడుపుతున్న ఇల్లీగల్ కంపెనీలో అభిరామి(Aparna Balamurali), కిరణ్ (హకీమ్ షాజహాన్) జాబ్ చేస్తూ ఉంటారు. వారిద్దరికీ పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఒకరోజు కిరణ్ ఉన్నట్టుండి మాయమవుతాడు. అప్పుడే జరిగిన ఓ ఘోర ట్రైన్ యాక్సిడెంట్ లో కిరణ్ చనిపోయాడని అనుకుంటారు. ఆతర్వాత కిరణ్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కోసం ఆన్ లైన్ రిపోర్టర్ అశ్విన్ (Asif Ali)  బాస్ రాజా కుమార్, ఇంకా పోలీస్ ఆఫీసర్ ఆర్ముగం(Sampath Raj) లు అభిరామిని టార్గెట్ చేస్తారు. కిరణ్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో ఏముంది, ఎందుకు రాజ్ కుమార్, ఆర్ముగం, అశ్విన్ లు దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు, అభిరామి ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది అనేది మిరాజ్ షార్ట్ స్టోరీ. 

మిరాజ్ ఎఫర్ట్స్ :

రిపోర్టర్ గా అసిఫ్ అలీ, అభిరామిగా అపర్ణ బాలమురళి, పోలీస్ ఆఫీసర్ గా సంపత్ రాజ్, నెగెటివ్ షేడ్స్ లో హకీమ్ షాజహాన్ వీళ్లంతా సహజ నటనతో మెప్పించారు. 

టెక్నీకల్ గా.. విష్ణు శ్యామ్ BGM, సతీశ్ కురుప్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ హైలెట్స్. అందమైన లొకేషన్స్ ను మరింత అందంగా తెరపైకి తీసుకుని వచ్చారు సతీష్. వినాయాక్ష్ ఎడిటింగ్ క్రిస్పీ గా మెప్పిస్తుంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శక ప్రతిభ గురించి .. స్క్రీన్ ప్లేపై ఆయనకి గల పట్టు గురించి ఆయన గత చిత్రాలు చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడియన్స్ ఊహకి అందని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లను తెరపై ఆవిష్కరించడంలో జీతూ జోసెఫ్ తర్వాతే. మిరాజ్ విషయంలోనూ అదే జరిగింది.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. అందులోను క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవల్.. ఊహకు కూడా అందదు. ఇలాంటి చిత్రాలు థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను ప్రేక్షకులు వీక్షించేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే జీతూ జోసెఫ్ సీక్రెట్ కూడా.. 

మిరాజ్ ఎనాలసిస్:

సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ట్విస్ట్ లకు ఉన్న ప్రాధాన్యత, ట్విస్ట్ లు ఆడియన్స్ కు థ్రిల్ ఇస్తే ఆ సినిమా పక్కా హిట్టు. అదే సూత్రాన్ని జీతూ జోసెఫ్ తన సినిమాలకు అప్లై చేస్తారు. సినిమా స్క్రీన్ పై అలా వెళుతుంటే.. దానిలో వచ్చే ట్విస్ట్ లకు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కట్టిపడే స్క్రీన్ ప్లే తో జీతూ జోసెఫ్ ఈ మిరాజ్ కథను రాసుకున్నారు. సింపుల్ స్టోరీ నే అదిరిపోయే మలుపులతో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసారు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మిరాజ్ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాయి. ఒకవేళ ఇప్పటివరకు మిరాజ్ ని చూడకపోతే వెంటనే సోని లివ్ లో ఈ చిత్రాన్ని వీక్షించేయ్యండి.. మీరు అద్భుతమైన థ్రిల్ ఫీలవుతారు.. 

Mirage Movie Mini review:

Mirage Telugu Movie Mini review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs