మెగాస్టార్ చిరంజీవి వచ్చే సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి మన శంకర్ వర ప్రసాద్ గారు తో రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు-నయనతార కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లోనే కాదు ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలున్నాయి. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో వసిష్ఠ దర్శకత్వంలో చిరు విశ్వంభర తో ఆడియన్స్ ని పలకరిస్తారు.
ఇక నవంబర్ మొదలు కాబోయే బాబీ-చిరు కాంబో మూవీ ని 2027 సంక్రాంతి కి రెడీ చేస్తారనే టాక్ మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది. బాబీ రెండేళ్ల క్రితమే మెగాస్టార్ తో తెరకెక్కించిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టడంతో ఇప్పుడు మరోసారి బాబీ సంక్రాంతిని టార్గెట్ చెయ్యడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో అంచనాలు మొదలయ్య్యాఇ.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న చిరు-బాబీ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక వీటి తర్వాత చిరు ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్ నటిస్తారనే ప్రచారం ఉండగా.. శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ కి ఓ మూవీ కమిట్మెంట్ ఉంది. సో చిరు వరసగా 2026, 27 లలో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు.