కింగ్ నాగార్జున బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో ఎప్పుడు అద్దరగొట్టేస్తారు. కంటెస్టెంట్స్ తప్పులను ఎత్తి చూపడమే కాదు, వారిని తప్పులు సరిచేసుకునేలాంటి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇక కొంతమంది కంటెస్టెంట్స్ పై నాగ్ ఫైర్ అవుతూ ఉంటారు. ఈ వారం నాగార్జున ఎవరిని వార్న్ చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఈ శనివారం ఎపిసోడ్ లో రమ్య ని నాగార్జున గట్టిగానే ఏసుకున్నారు. పచ్చళ్ళ పాప ఇంకా మాధురి మధ్యలో జరిగిన గొడవలు తీసుకుని అమ్మా రమ్యా నువ్వు తనూజ ని బాండింగ్స్ మీద నామినేట్ చేసావు. నువ్వు మధురి తో కోరుకునేది బాండింగ్ అదే కదా అన్నారు. అంతేకాదు రమ్య ఒకరి దగ్గర ఒకలా, మరొకరి దగ్గర మాట్లాడుతున్నావ్ అదే తప్పవుతుంది అంటూ పచ్చళ్ళ పాప ని నాగార్జున అనగానే రమ్య ఫేస్ మాడిపోయింది.
ఇక ఇమ్మాన్యువల్ ని మొదటి నుంచి పొగుడుకుంటూ వస్తున్న నాగార్జున ఈ వారం ఇమ్ము ముసుగు తీసేసారు. అంతేకాదు నువ్వుసేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ క్లియర్ కట్ గా తనూజ విషయంలో ఇమ్మాన్యువల్ చేసిన తప్పుని వీడియో ప్రూఫ్ తో సహా చూపించగానే తనూజ షాకయ్యింది. కళ్యాణ్ సంజన ని నామినేట్ చెయ్యగానే కోపం తెచ్చుకున్నావ్, నీ దగ్గర పాయింట్స్ ఉంటే నువ్వే నామినేట్ చెయ్యి అంటూ నాగార్జున ఇమ్మాన్యువల్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు.
సోషల్ మీడియాలోనూ తనూజ విషయంలో ఇమ్మాన్యువల్ డబుల్ గేమ్ పై వచ్చే కామెంట్స్ ని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో అదే మాట్లాడారు. ఇక రీతూ vs మాధురి విషయంలో రీతూ దే తప్పని తేల్చేసారు. మాధురి మీ వాయిస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ నాగర్జున చెప్పారు.