మదరాసి సినిమాతో డిజప్పాయింట్ అయిన కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కు కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) హిట్ ఫుల్ జోష్ నిచ్చింది. రాజకుమారిగా అందంగా, ఆకర్షణగా, అద్భుతమైన లుక్ లో పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ ని చాలామంది కాంతార(Kantara) చిత్రం తర్వాత లైక్ చేస్తున్నారు.
మరోపక్క Jr.ఎన్టీఆర్ అభిమానులు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్-నీల్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్)లో రుక్మిణి వసంత్ హీరోయిన్. ఇప్పటికే డ్రాగన్ షూట్ లో జాయిన్ అయిన రుక్మిణి పై ఎన్టీఆర్(Jr.NTR) ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక రుక్మిణి వసంత్ సోషల్ మీడియా పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే.
అదేదో గ్లామర్ గా ఉంటాయని కాదు. ఆమె సింపుల్ లుక్స్ తోనే ఆకర్షణగా కనిపిస్తుంది. తాజాగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) సోషల్ మీడియా పిక్స్ లో కళంకారీ ఓణీ లో బ్లూ లెహంగా లో బ్యూటిఫుల్ అనే పదం కూడా చిన్నాదేనేమో అనేంత అందంగా కనిపించింది. రుక్మిణి(Rukmini Vasanth) లేటెస్ట్ లుక్ మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.