దగ్గుబాటి రానా ప్రస్తుతం సినిమాలు తగ్గించి, నిర్మాతగానూ, అలాగే వ్యాపారాలపై దృష్టి పెట్టారు. కరోనా సమయంలో తను ప్రేమించిన అమ్మాయి మిహిక బజాజ్ ను పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా కొద్దిమంది రిలెటివ్స్, స్నేహితులు, సన్నిహితుల నడుమ వివాహం చేసుకున్న రానా.. ఎప్పుడెప్పడు గుడ్ న్యూస్ చెబుతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈమధ్య కాలంలో మిహిక ప్రెగ్నెంట్ అంటూ వార్తలొచ్చినా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. తాజాగా దగ్గుబాటి ఇంట సంతోషం వెల్లువిరిసే వార్త అందించారు రానా దంపతులు. రానా తండ్రికాబోతున్నారనే వార్త అభిమానులను చాలా అంటే చాలా సంతోషపెట్టింది. సురేష్ బాబు తాతగా ప్రమోట్ కాబోతున్నారు.
మొన్న రామ్ చరణ్ ఇంట గుడ్ న్యూస్ వినిపిస్తే ఇప్పుడు రానా నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. మిహిక బజాజ్ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.