మలయాళంలో 30 కోట్ల బడ్జెట్ తో టాప్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కొత్త లోక చాప్టర్ 1. ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు.. పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన ప్రతి భాషలోనూ ప్రేక్షకులకు నచ్చేసింది. సక్సెస్ ఫుల్ టాక్ తో కొత్త లోక 300 కోట్లు కొల్లగొట్టి అందరికి షాకిచ్చింది.
తెలుగులోనూ మంచి హిట్ అయిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించింది. మొట్టమొదటి సూపర్ ఉమన్ గా తెరకెక్కిన కొత్త లోక అందరికి నచ్చేయ్యడంతో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే కొత్త లోక ఓటీటీ రిలీజ్ పై అందరిలో విపరీతమైన ఆసక్తి కనిపించింది.
కానీ కొత్త లోక ఓటీటీ డేట్ విషయంలో ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ జియో ప్లస్ హాట్ స్టార్ కమింగ్ సూన్ అంటూ ఊరిస్తూనే ఫైనల్ గా కొత్త లోక స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసింది. అక్టోబర్ 31కొత్త లోక జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీలలోనూ ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ హాట్ స్టార్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
థియేటర్స్ లో మిస్ అయిన, లేదంటే మళ్లీ మళ్ళీ కొత్త లోక ను వీక్షించాలనుకునేవారు ఇకపై ఓటీటీలో చూసేందుకు రెడీ అవ్వండి.