రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ కాంబో మూవీ అప్ డేట్ కోసం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది. రాజమౌళి నవంబర్ లో SSMB 29 అప్ డేట్ ఇస్తామంటూ చెప్పినప్పటినుంచి మహేష్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. రాజమౌళి ఎప్పుడెప్పుడు అప్ డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ SSMB 29 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
రాజమౌళి తనయుడు కార్తికేయ సుమ కొడుకు రోషన్ నటించిన మౌళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్-రాజమౌళి మూవీ పై క్రేజీ అప్ డేట్ వదిలాడు. నాన్నగారి (Rajamouli) సినిమాల్లో వర్క్ ఉంటే కచ్చితంగా చెబుతారు. ముఖ్యంగా రికార్డింగ్ సెషన్స్ కి వెళ్తా. SSMB29కు సంబంధించి కూడా మ్యూజిక్ పనులు రీసెంట్ గానే మొదలయ్యాయి. నేను కూడా అందులో భాగమయ్యా అంటూ SSMB 29 లో ఏం జరుగుతుందో అనేది అప్ డేట్ ఇచ్చారు.
మరి నవంబర్ లో రాజమౌళి-మహేష్ మూవీ టైటిల్ గ్లింప్స్ వదులుతారు, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ చేతుల మీదుగా SSMB 29 ఫస్ట్ అప్ డేట్ ని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు, అందుకు తగ్గట్టుగానే పనులు చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని హాలీవుడ్ స్టయిల్లో ప్లాన్ చేస్తుంది టీమ్ అనే ప్రచారం జోరుగా జరుగుతుంది.