బిగ్ బాస్ సీజన్ 9 లో సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తనూజ మాట తీరు, ఆమె సింపుల్ లుక్స్ కి, ఆమె ఆటతీరుపై ఆడియన్స్ ముగ్దులవుతున్నారు. కాబట్టే ఆమె నామినేషన్స్ లోకి వచ్చింది అంటే చాలు ఆమెను టాప్ లో ఉంచుతున్నారు. అయితే ఈవారం కళ్యాణ్ నామినేషన్స్ లోకి రావడంతో కళ్యాణ్ తనూజాకు ఓటింగ్ లో గట్టి పోటీ ఇస్తున్నాడు.
ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం ఆడిన టాస్క్ లో తనూజ స్మార్ట్ గా అలోచించి సంజన నుంచి డబ్బులు కొట్టేసింది. ఈ టాస్క్ లో 7000 పాయింట్స్ తో తనూజ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అయితే కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్ లో హ్యాట్ టాస్క్ ఆడారు. కంటెండర్లు రింగ్ లో ఆ హ్యాట్ అందుకుని బయట ఉన్న వాళ్లకు ఇస్తే వాళ్ళు తమకు నచ్చని వాళ్ళను కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ చెయ్యొచ్చు.
అలా ముందుగా గౌరవ్ కళ్యాణ్ ని తీసేసాడు, దివ్య ని సంజన తీసేసింది, మాధురి నిఖిల్, రీతూ ని తీసేసింది, చివరిగా ఇమ్మాన్యువల్ హ్యాట్ తీసుకుని సంజన కు ఇస్తే మాధురి అది అన్ ఫెయిర్ అవుతుంది అనగానే నేను మార్చుకుంటా అంటూ మధురికి హ్యాట్ ఇచ్చాడు.. ఈలోపుకి తనూజ కళ్ళు తిరిగిపడిపోయింది.
ఆమెకు హెల్త్ బాలేదు అని గత రాత్రి ఎపిసోడ్ లో సంజన అంది, ఈ ప్రోమోలో ఆమె పడిపోయింది. మరి తనూజ కి ఏమైంది, ఆమె ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియక ఆమె ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు.