హీరో నితిన్ వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకుంటే అవి నితిన్ ని డిజప్పాయింట్ చేశాయి. దానితో నితిన్.. దిల్ రాజు బ్యానర్ లో వేణు డైరెక్షన్ లో చెయ్యాల్సిన ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రెండు మూడు ప్రాజెక్ట్స్ నుంచి నితిన్ తప్పుకున్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నితిన్ కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు అందుకే అతను ఇంతకుముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ వదిలేసాడు అన్నారు. ఇప్పుడు అదే లెక్కలోకి సిద్దు జొన్నలగడ్డ చేరాడనే టాక్ వినిపిస్తుంది. టిల్లు సిరీస్ తో అదరగొట్టేసిన సిద్దు జొన్నలగడ్డ తర్వాత జాక్ తో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు.
ఇప్పుడు తెలుసు కదా తోనూ ఆడియన్స్ ని పూర్తి గా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయాడు. దానితో సిద్దు జొన్నలగడ్డ నటించాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మరి సిద్దు నటించాల్సిన కోహినీర్ సినిమా ఆగిపోయింది అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారింది.