ధనుష్ రీసెంట్ మూవీ ఇడ్లీ కొట్టు. తమిళనాట ఇడ్లీ కడాయిగా విడుదలైన ఈ చిత్రం తెలుగులో మాత్రం ఇడ్లీ కొట్టు గా డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్-నిత్య మీనన్ జంటగా కనిపించిన ఈ చిత్రానికి తెలుగు, తమిళం నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. ధనుష్, నిత్యా మీనన్ యాక్టింగ్ నేచురల్‌గా, ఎమోషనల్‌గా ఉందని, స్టోరీ బావుంది అంటూ ఆడియన్స్ మాట్లాడుకున్నారు.
థియేటర్స్ లో కన్నా ఈచిత్రాన్ని ఓటీటీ లో చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ఫైనల్ గా థియేట్రికల్ రన్ ముగియడంతో ఇడ్లీ కొట్టు చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో ఇడ్లీ కొట్టు చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 నుంచి తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.