కోలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారిన ప్రదీప్ రంగనాధన్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. మెల్లగా దూసుకుపోతున్నాడు. లవ్ టుడే తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కెరీర్ లో నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాధన్ ఆతర్వాత ఎంటర్ ద డ్రాగన్ గా మరోసారి ఈ కుర్ర సత్తా చాటాడు.
ఇప్పుడు డ్యూడ్ అంటూ సింపుల్ గా 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. దివాళి స్పెషల్ గా విడుదలైన ఈ చిత్రానికి ఓ అన్నంత సూపర్ హిట్ టాక్ రాలేదు. యావరేజ్ టాక్ తోనే డ్యూడ్ యూత్ కి కనెక్ట్ అవడంతో ఆ చిత్రం ఇలా మొదటి వారంలోనే 100 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు, తమిళంలో డ్యూడ్ 100 కోట్ల క్లబ్బులోకి చేరి హిట్ అయ్యి కూర్చుంది.
ప్రదీప్ రంగనాధన్ వరసగా మూడు సినిమాలను 100 కోట్ల క్లబ్బులోకి పంపించాడు. ప్రదీప్ రంగనాధన్ యాక్టింగ్ స్కిల్స్, అతని మ్యానరిజం, ఇంకా ప్రదీప్ రంగనాధన్ స్టయిల్ మెల్లగా యూత్ కి కనెక్ట్ అవడంతోనే అతని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.
అంతేకాదు ప్రదీప్ రంగనాధన్ నటిస్తున్న సినిమాల్లో కంటెంట్ కూడా బావుండడంతో ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK మూవీలో నటిస్తున్నాడు ప్రదీప్ రంగనాధన్. ఆ చిత్రం డిసెంబర్లో విడుదల కాబోతుంది.