దీపావళికి మెగాస్టార్ ఇంట దివాళి బాష్ అంటూ వెంకీ, నాగ్ ఫ్యామిలీలతో ఉన్న పిక్స్ ని మెగాస్టార్ చిరు షేర్ చేసారు. అదే పార్టీలో నయనతార అలాగే భర్త విగ్నేష్, నయన్ కోడలు పాల్గొన్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే అదే దివాళి పార్టీలో ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంత వేడుకను మెగా ఫ్యామిలీ కాస్త లేటుగా నిన్న గురువారమే రివీల్ చేసింది.
రామ్ చరణ్-ఉపాసన దంపతులు రెండోసారి తల్లితండ్రులుగా మారబోతున్నారు, అంటూ ఉపాసన సీమంతం వేడుకను మెగాస్టార్ చిరు రివీల్ చేశారు. అదే దివాళి పార్టీ, అదే ఉపాసన సీమంతం.. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ భార్య అన్న, నాగబాబు ఫ్యామిలీ, వరుణ్ తేజ్-లావణ్య, నిహారిక, మెగాస్టార్ సిస్టర్స్ వీళ్లంతా పాల్గొనడమే కాదు.. వెంకటేష్, నాగార్జున, నయనతార ఫ్యామిలీస్ తో సహా పాల్గొన్నారు. అయితే దివాళి పార్టీ ఫొటోస్ లో కానీ, నిన్న వదిలిన ఉపాసన సీమంతం వీడియో లో కానీ ఎక్కడా అల్లు ఫ్యామిలిలో ఒక్కరు కూడా కనిపించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, స్నేహ ఇలా ఎవ్వరూ మెగా దివాళి బాష్, ఉపాసన సీమంతం వేడుకలో కనిపించకపోవడం పై మరోసారి మీడియాలో రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి.
అయితే అల్లు ఫ్యామిలోను దివాళి వేడుకలు జరిగిన విషయాన్ని స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో వేదికగా పంచుకోవడం, అందులో శిరీష్ కి కాబోయే భార్య కనిపించడం అన్ని అల్లు అభిమానులకు సంతోషాన్ని ఇచ్చాయి.