నిన్న ప్రభాస్ బర్త్ డే కి ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చాయి. అయితే కేవలం ప్రభాస్ షూటింగ్ చేస్తున్న చిత్రాలైన రాజా సాబ్ నుంచి పోస్టర్ వచ్చింది. కలర్ ఫుల్ గా ఉన్న ద రాజా సాబ్ పోస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంప్రెస్స్ అయ్యారు. ఇక హను రాఘవపూడి తో ప్రభాస్ చేస్తున్న మూవీ నుంచి టైటిల్ ని పవర్ ఫుల్ పోస్టర్ తో వదిలారు. ఫౌజీ టైటిల్ అందులోని ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
అంతా బాగానే ఉంది కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే కల్కి నుంచి జస్ట్ విషెస్ చెప్పారు కానీ.. కొత్త పోస్టర్ ఇవ్వలేదు, అలాగే అన్నిటికన్నా ముందు సలార్ 2 నుంచి మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం పై ప్రభాస్ అభిమానుల్లో కాస్త
నిరాశ కనిపించింది.
ఇక ఎప్పుడో మూడేళ్ళ క్రితమే అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో కలిసి చెయ్యాల్సిన స్పిరిట్ నుంచి షూటింగ్ అప్ డేట్ అయినా.. లేదంటే ప్రీ లుక్ పోస్టర్ ఏదైనా వదిలితే బావుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు. కానీ సందీప్ వంగ మాత్రం స్పిరిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నైట్ వరకు ఊరించి అప్పుడు ఫ్యాన్స్ కి స్పిరిట్ ట్రీట్ అందించారు.
ప్రభాస్ బర్త్ డే రోజు నైట్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించారు. సౌండ్ స్టోరీ అంటూ కేవలం డైలాగ్ లు మాత్రమే వినిపిస్తున్న వీడియోని వదిలారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్న.. ప్రతి అభిమాని కోసం హార్ట్ నుంచి నేరుగా అయిదు భాషల్లో సౌండ్ స్టోరీని అందిస్తున్నాం అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా X లో పోస్టు చెయ్యడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.