బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడమే కాదు కేసీఆర్ ప్రవర్తించే తీరు అలానే ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలోనూ కేసీఆర్ సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన ఈ ఉప ఎన్నికను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. మరెందుకింత సైలెంట్. కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లు ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ని ముందుండి నడిపించాల్సిన కేసీఆర్ ఇలా వెనకుండి నడిపిస్తున్నారు. ఓటమి తర్వాత ప్రజలతో కలవాల్సిన కేసీఆర్ ఇలా సైలెంట్ గా ఎందుకుంటున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారనే విషయం పక్కనపెడితే కేసీఆర్ ఇలా ఉండడంతో బీఆర్ఎస్ నేతలకు కొంతమందికి నచ్చడం లేదు.
కవిత ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ మీడియాలో ఎక్కడా హైలెట్ అవ్వలేదు. ఈరోజు పార్టీ సమావేశాన్ని కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే నిర్వహించారు. అక్కడే సీఎం రేవంత్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఓ రౌడీ షీటర్ కు కాంగ్రెస్ సీటు ఇచ్చింది, ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ని గెలిపించాలని అంటూ ఆయన ప్రజలను కోరారు.
అయితే పార్టీ నుంచి అటు కూతురు దూరమవడం, ఇటు పార్టీ లో సమస్యల్తో కేసీఆర్ ముందుండి పోరాడాల్సింది పోయి అలా ఫామ్ హౌస్ కే అంకితమవ్వడం ఏమిటో అనేది బీఆర్ఎస్ నేతలకే అంతుబట్టడం లేదు.