ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ అంటూ రాజా సాబ్ మేకర్స్ మొదట్లో ఊరించినా.. చివరికి రాజా సాబ్ బర్త్ డే కి జస్ట్ కొత్త పోస్టర్ తో సరిపెట్టారు. ఎప్పుడో నెల ముందే రాజా సాబ్ ట్రైలర్ ని వదిలేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన మేకర్స్ బర్త్ డే కి ఇంకెంత సర్ ప్రైజ్ ఇస్తారో అని అభిమానులు చాలా వెయిట్ చేసారు.
మేకర్స్ కూడా ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగల్ అంటూ చెప్పినా చివరికి రాజా సాబ్ ఫస్ట్ సింగల్ సర్ ప్రైజ్ ఇవ్వలేకపోయారు. కాకపోతే రాజా సాబ్ పోస్టర్ తో ఫ్యాన్స్ ని ఛిల్ చేసారు. రాజా సాబ్ ప్రభాస్ బర్త్ డే పోస్టర్లో ప్రభాస్ కూల్ గా కలర్ ఫుల్ గా కనిపించారు. దానితో అభిమానులు కూడా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
ప్రభాస్ ని ఇలా ఛిల్ మోడ్ లో చూసి చాలాకాలమవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ తోనే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జనవరి 9 టార్గెట్ గా సిద్దమవుతున్న రాజా సాబ్ షూటింగ్ చివరి షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యింది. సో ఇకపై అభిమానులు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా రిలీజ్ సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వాల్సిందే.