థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన మలయాళ సూపర్ ఉమన్ ఫిలిం కొత్త లోక చాప్టర్ 1 చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడని ఆడియెన్ లేరు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలై మూడు వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఈ రేంజ్ లో హిట్ అవడం అందరికి షాకిచ్చింది.
అందుకే కొత్త లోక ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. జియో ప్లస్ హాట్ స్టార్ కొత్త లోక చాప్టర్ 1 స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ దీపావళికి కొత్త లోక ఓటీటీ లోకి వస్తుంది అన్నారు. దీపావళి వచ్చింది వెళ్ళింది. కానీ కొత్త లోక జాడ లేదు.
జియో హాట్ స్టార్ వాళ్ళు కూడా కమింగ్ సూన్ అంటున్నారు తప్ప ఇప్పటివరకు స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. మరి ఈ వారం కొత్త లోక ఓటీటీ రిలీజ్ ఉండకపోతే మరికొద్ది రోజులు కొత్త లోక కోసం వెయిట్ చెయ్యాల్సిందే.