నారీ నారీ నడుమ మురారి! అంటూ ఇద్దరు నారీమణుల మధ్య నలిగిపోయే యువకుడి ప్రేమకథల్ని మన దర్శకులు అందంగా తెరపైకి తెచ్చారు. బాలీవుడ్ లో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కథానాయికలతో ఒకేసారి ప్రేమకథలు నడిపించిన హీరోలు కూడా ఉన్నారు. షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ లాంటి స్టార్లు ఇద్దరు కథానాయికలతో ఎఫైర్లు సాగించిన సందర్భాలున్నాయి.
అయితే ఇక్కడ ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా జీవితంలోను నారీమణుల నడుమ నలిగిపోయిన వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. నిరంతరం హిందీ చిత్రసీమ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేసే రణవీర్ జీవితంలోను ఇద్దరమ్మాయిలు ఉన్నారు.
ఇటీవల దీపావళి పండుగను అతడు తన కొత్త గాళ్ ఫ్రెండ్ జూహీ భట్ తో కలిసి సెలబ్రేషన్ తో బిజీ అయ్యాడు. కానీ అతడు ఇంతకుముందు టీవీ నటి నిక్కీ శర్మతో డేటింగ్ చేసాడు. కొత్త ప్రియురాలితో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న రణవీర్ ని తలచుకుని మాజీ ప్రేయసి నిక్కీ శర్మ జెలసీ ఫీలవుతోందట. ప్రస్తుతం యూట్యూబర్ ప్రేమాయణాలు అభిమానుల్లో హాట్ టాపిగ్గా మారాయి.