పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బర్త్ డే ఈరోజు. అక్టోబర్ 23 అంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగే. ప్రభాస్ (Prabhas) బర్త్ డే ని కేక్ కటింగ్స్, పాలాభిషేకాలతోనే కాదు బ్యానర్ కట్టి సంబరాలు చేసుకుంటారు. టాలీవుడ్ లో మొట్ట మొదటిగా పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ అయిన హీరో ప్రభాస్. అందుకే ఆయనకు ఇండియా మొత్తంగా వీరాభిమానులు ఉన్నారు.
ఇక నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఒక్కోక్కటిగా అప్ డేట్స్ ఇస్తూ ప్రభాస్ అభిమానులకు మేకర్స్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం నుంచి టైటిల్ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే ప్రభాస్-హను మూవీకి ఫౌజీ(Fauzi) టైటిల్ ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసారు. అంతేకాదు ప్రభాస్ ఫస్ట్ లుక్ వదిలారు. ఫౌజీ (Fauzi)లో ప్రభాస్ లుక్ కి అభిమానులు తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు.
ఫౌజీ(Fauzi) టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ కి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కాలిపోతున్న ఇంగ్లీష్ జెండాల వెనుకాల నుంచి ప్రభాస్ సీరియస్ లుక్ లో చూస్తున్నారు. ఫౌజీ(Fauzi) పోస్టర్ పై ఒంటరిగా పోరాడే బెటాలియన్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.