బిగ్ బాస్ సీజన్ 9 లో లేడీ కంటెస్టెంట్ తనూజ కు ఎదురు లేదు. తనూజ కొన్ని తప్పులు చేస్తుంది. బాండింగ్స్ పెట్టుకుంటుంది. ఎమోషనల్ అవుతుంది. కానీ ఆమెను ఎవరైనా నామినేట్ చేస్తే బుల్లితెర ప్రేక్షకులు తనూజ ను సపోర్ట్ చేస్తూ ఓట్స్ వేస్తున్నారు. గత కొన్ని వారాలుగా తనూజ ను హౌస్ లో ఉంచాలనే తపన ఆడియన్స్ లో కనిపిస్తుంది.
ఆమె బాండింగ్స్ పెట్టుకున్నా, ఎమోషనల్ అయినా ఆమె గేమ్ ఎక్కడా పక్కకు వెళ్ళలేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం, కాబట్టే ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఆమె మాట తీరుకి ఫిదా అవుతున్నారు. మరోపక్క తనూజ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన అయేషా, రమ్య టార్గెట్ చేస్తే ఓకె కానీ ఆమె నమ్మిన కళ్యాణ్, ఇమ్మన్యువల్ అందులొను సంజన తనూజ ను కావాలనే టార్గెట్ చెయ్యడం ఆడియన్స్ కు నచ్ఛలేదు.
ఇప్పటివరకు క్లీన్ చీట్ తో ఉన్న ఇమ్మాన్యువల్ తనూజ విషయంలో నెగిటివిటీ మూట గట్టుకుంటున్నాడు. కావాలనే తనూజ ను డీగ్రేడ్ చెయ్యడానికి ఇమ్మాన్యువల్ అలా సేఫ్ ప్లే చేస్తున్నన్నాడంటున్నారు. అటు రివ్యూయర్స్ కూడా తనూజ కు సపోర్ట్ గా రివ్యూస్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం తనూజ కు హౌస్ లో ఎదురు లేదు. అందరి టార్గెట్ తో ఆమె టాప్ 5 లోకి వెళ్లడం ఖాయమంటున్నారు.