టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తన ట్యూన్స్ ని, సాంగ్స్ ని ఎవరైనా వాడితే వారిని కోర్టు కి ఈడ్చి డబ్బు వసూలు చేయడమనేది కొన్నాళ్లుగా పరిపాటిగా మారిపొయింది. తన పాటల్లోని చిన్న ట్యూన్ వాడినా ఇళయరాజా గారు ఊరుకోరు. మైత్రి మూవీస్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ లో తన పాత పాట వాడినందుకు ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేసారు.
కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ లో సాంగ్ కోసం మేము సోని మ్యూజిక్ కి డబ్బులిచ్చి తీసుకున్నామని మైత్రి నిర్మాత డ్యూడ్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇళయరాజా కు సోని మ్యూజిక్ అంటూ ఆయన ఈజీగా చెప్పేసారు. ఇప్పుడు ఇళయరాజా డ్యూడ్ సినిమా యూనిట్ కి అంటే మైత్రి మూవీస్ వాళ్లకు నోటీసులు పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.
డ్యూడ్ చిత్రంలో తన రెండు పాటలను వాడారని డ్యూడ్ టీమ్ కి ఇళయరాజా నోటీసులు ఇచ్చారు. నిజంగానే డ్యూడ్ లో ఇళయరాజా పాటలను అక్కడక్కడా బ్యాగ్రౌండ్లో వాడారు. ఇప్పుడు డ్యూడ్ కి అదే సమస్యగా మారింది. సో డ్యూడ్ ని ఇళయరాజా వదలకుండా వెంట పడతారు కాదు కాదు పడుతున్నారు. మరి ఈ విషయమై డ్యూడ్ మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.