మెగాస్టార్ చిరంజీవితో ముచ్చటగా మూడోసారి నటిస్తుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో నయనతార చిరు తో రొమాన్స్ చేస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.
రీసెంట్ గా మెగాస్టార్ చిరు ఇంట్లో దివాళి పార్టీ ని నిర్వహించారు. ఈ పార్టీకి సినీ ప్రముఖులైన వెంకటేష్, నాగార్జున తమ తమ ఫ్యామిలీస్ తో అటెండ్ అవ్వగా.. నయనతార సోలో గా చిరు ఇంట్లో కనిపించింది. అయితే ఈ పార్టీలో నయనతార మాత్రమే పాల్గొంది అనుకున్నారు.
కానీ చిరు ఇంట జరిగిన దివాళి పార్టీకి నయనతార తన భర్త విగ్నేష్ శివన్, నయన్ కొడుకులు తో సహా పాల్గొన్న ఫొటోస్ తాజాగా బయటికి వచ్చాయి. తన హీరోయిన్ ఫ్యామిలీని కూడా చిరు తన ఇంట పార్టీకి ఆహ్వానించారు. చిరుతో నయనతార ఫ్యామిలీ దిగిన ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.