బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంటర్టైనర్ గా జబర్దస్త్ ఇమ్మాన్యువల్ ఎంట్రీ ఇచ్చి మొదటి వారం నుంచి కామెడీగా పరంగా పెరఫార్మెన్స్ బావుండడం, మిగతా హౌస్ మేట్స్ తో కలివిడిగా కలిసి కామెడీ చెయ్యడం అన్ని ఇమ్మాన్యువల్ ని టైటిల్ ఫెవరేట్ ని చేసాయి. అటు నాగార్జున వారం వారం ఇమ్మాన్యువల్ ని పొగడడం, గోల్డ్ స్టార్ ట్యాగ్ ఇవ్వడం ఆడియన్స్ లో ఇమ్మాన్యువల్ కి క్రేజ్ ఉండడం, అలాగే అస్సలు నామినేషన్స్ కి రాకపోవడం అతనికి ప్లస్ గా మారింది.
సంజన ను అమ్మ, మమ్మి అంటూ బాండింగ్ పెట్టుకుని ఇమ్మాన్యువల్ తనూజా ను టార్గెట్ చేస్తున్న తనూజ భరణి తో నాన్న అని ఉండడమే, కళ్యాణ్ తో కలిసి తిరగడం ఇవన్నీ ఇమ్మాన్యువల్ కి నచ్చలేదు. ముఖ్యంగా తనని దూరం పెట్టడం, వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ ముందే ఇమ్మాన్యువల్-తనూజ లు ఒక్కరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. అయితే తనూజ ను బంధాలు అంటూ నామినేట్ చేద్దామనుకుని కళ్యాణ్ నామినేట్ చేస్తాడు అని సేఫ్ గేమ్ ఆడిన ఇమ్మాన్యువల్ కి కళ్యాణ్ షాకిచ్చి సంజనను నామినేట్ చేసాడు.
దానితో ఇమ్మాన్యువల్ కి నేను తనూజ ను చేద్దామనుకున్నా, కానీ కళ్యాణ్ అనే వాడు తనూజ ను ఎలా నామినేట్ చేస్తాడో చూదామనుకున్నా, నా వల్ల సంజన గారు వెళ్ళిపోతే నేను ఫీల్ అవుతా అంటూ బాండింగ్ పై బాధపడిపోయాడు. ఇక రమ్య నేను తనూజ ని నామినేట్ చేస్తా అనగానే నామిషన్ టికెట్ ఇవ్వడం, నామినేషన్స్ అయ్యాక తనూజ తో ఇమ్మన్యువల్ ని నెగెటివ్ చేస్తున్నాయి.
తనూజ ను బాండింగ్స్ పెట్టుకున్నావ్ అన్న ఇమ్ము సంజన తో చేసేదేమిటి, తనూజ ని తను నామినేట్ చేస్తే బాధపడుద్ది అన్న ఇమ్మాన్యువల్ కళ్యాణ్, రమ్య లకు ఆమెను నామినేట్ చెయ్యడానికి వచ్చి సేఫ్ గేమ్ ఆడాడు. ఇప్పుడు కూడా ఈ వారం టాస్క్ లో ఇమ్మాన్యువల్ సంజన గ్రూప్ లోకి వెళితే ఎక్కడ బాండింగ్స్ అంటారో అని భయపడి మాధురి టీంలోకి వెళ్ళాడు. ఇదంతా ఇమ్మాన్యువేల్ సేఫ్ గేమ్ కదా అంటూ అందరూ ఇమ్మాన్యువల్ గురించి మాట్లాడుకుంటున్నాను.