OG చిత్రం సెప్టెంబర్ 25 న విడుదలై టాక్ తో సంబంధం లేని కలెక్షన్స్ తెచ్చుకుంది. థియేటర్స్ లో OG చూసి ఆహా ఓహో అన్నారు కానీ అందుకు తగ్గ కలెక్షన్స్ ఈ సినిమాకు రాలేదు. అయితే నిర్మాత దానయ్య మాత్రం OG కి ఎక్కువ బడ్జెట్ పెట్టాడని దర్శకుడు సుజిత్ పై కోప్పడ్డారని, అందుకే నాని తో సుజిత్ తో తియ్యాల్సిన మూవీ నుంచి తప్పుకున్నారని అన్నారు.
OG తర్వాత నాని-సుజిత్ కలయికలో మూవీ అనౌన్స్ చేసి సినిమా ఓపెనింగ్ సమయానికి దానయ్య సుజిత్ వల్లె ఈప్రాజెక్టు నుంచి సైడ్ అయ్యారని, OG ప్రీక్వెల్ కూడా దానయ్య నిర్మించడం లేదు అనే ప్రచారం జరిగింది. అయితే ఈ రూమార్స్ పై సుజిత్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రెస్ నోట్ వదిలి క్లారిటీ ఇచ్చారు.
చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఒక సినిమా మొదలు పెట్టి చివరికి పూర్తిచేయడం ఎంత కష్టమో అనేది కొద్దిమందికే తెలుసు. నా నిర్మాత, నా టీమ్ ఓజీ పై చూపించిన నమ్మకాని మాటల్లో చెప్పలేను. అదే ఈ సినిమాకు బలం ఇచ్చింది. ఇది ఎవరికీ సులభం కాదు, కానీ ప్రతీ కష్టం, ప్రతీ ప్రయత్నం అంకితభావం నుంచే వచ్చింది.
దానంతటికి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, ఓజీ సినిమాకు అభిమానులు చూపుతున్న ప్రేమ, పిచ్చి ఈ ప్రయాణాన్ని అర్థవంతంగా మార్చింది. నిరంతరం నన్ను విశ్వసించి, మద్దతుగా నిలిచిన దానయ్య గారికి నా కృతజ్ఞతలు అంటూ సుజిత్ తనకు దానయ్య కు మధ్యన ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఆ నోట్ ద్వారా తెలియజేసినట్లయ్యింది.