పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలు అకీరా, ఆద్య లతో కలిసి ఉంటుంది. పవన్ తో విడిపోయాక వేరే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకుని దానిని బ్రేక్ చేసుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఆ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే తను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనను అందరూ ఎన్నో మాటలన్నారని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది.
కమ్‌బ్యాక్ అయ్యింది, ఇకపై ఎక్కడ చూసినా రేణు నే కనిపిస్తుంది. ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తుందని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేను ఇప్పటివరకూ మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. ఆ తర్వాత ఏ సినిమాకి ఒప్పుకోలేదు. అప్పుడు నా గురించి కామెంట్ చేసినవాళ్ళే ఇప్పుడు వచ్చి సారీ చెబుతున్నారు.
ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. రీసెంట్ గానే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాను అని అందులో తాను అత్త పాత్రలో కనిపించనున్నట్లు రేణు దేశాయ్ ఆ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అది అత్తా కోడళ్ల కామెడీ మూవీ అని, తన పాత్రకి జస్టిఫికేషన్ ఉంటుందని చెప్పిన రేణు దేశాయ్ తనకు నటన అంటే చాలా ఇష్టమని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.