హీరోయిన్ త్రిష 40 ఏజ్ లోను ఇప్పటికి మిల మిల మెరిసే అందంతో అద్దరగొట్టేస్తుంది. ఈ ఏజ్ లోను త్రిష చేతినిండా అవకాశాలతో కళకళలాడుతుంది. ఈమధ్యన త్రిష పేరెంట్స్ చూసిన పెళ్లి సంబంధం చేసుకోబోతుంది. త్రిష ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంటుంది అంటూ ప్రచారం జరగడంతో త్రిష సీరియస్ అవుతూ.. పెళ్లి మాత్రమేనా నా హనీమూన్ ఎక్కడో కూడా చెబుతారా అంటూ ఫైర్ అయ్యింది.
తాజాగా త్రిష షేర్ చేసిన పిక్ లో ఆమె కుక్కపిల్లతో కలిసి సరదాగా ఆడుకుంటుంది. రాణి పింక్ డ్రెస్ లో త్రిష లూజ్ హెయిర్ లో ఏంజెల్ లా కనిపించింది. ప్రస్తుతం త్రిష లేటెస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక త్రిష తెలుగులో మెగాస్టార్ చిరు విశ్వంభర చిత్రాల్లో నటిస్తుంది. ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. తమిళనాట కూడా ఈ క్యూటి బిజీగానే కనిపిస్తుంది.