బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం నుంచి ఫ్రెడ్లి గా కనిపించిన తనూజ కి ఇమ్మాన్యువల్ కి నడుమ ప్రస్తుతం తత్సంబందాలు లేవు. భరణితో నాన్న అని, ఇమ్ము తో స్నేహం అంటూ తిరిగిన తనూజ టెనెంట్స్ అయిన కళ్యాణ్ తో స్నేహం చెయ్యడం ఇమ్మాన్యువల్ కి నచ్చలేదు. ఇమ్మాన్యువల్ జోకులు తనూజ కి నచ్చలేదు. కళ్యాణ్ కోసం తనూజ త్యాగం చెయ్యడం ఇమ్ము ని చిరాకు పెట్టాయి.
మొత్తం మీద వీకెండ్ ఎపిసోడ్ లోను ఇమ్మాన్యువల్ తనూజాకు చేదు లడ్డు తినిపించాడు. నువ్వు దూరం పెట్టావ్ అంటే నువ్వు దూరం పెట్టావ్ అంటూ నాగార్జున ముందే గొడవపడ్డారు. ఇప్పుడు నామినేషన్స్ లో కళ్యాణ్ తనూజ ను నామినేట్ చేస్తాను అని ఇమ్మాన్యువల్ కి మాటిచ్చి సంజనను నామినేట్ చెయ్యడం ఇమ్మాన్యువల్ కి కోపం తెప్పించింది.
దానితో ఇమ్మాన్యువల్ కళ్యాణ్ నువ్వు నన్ను మోసం చేసావ్, లేదంటే నేను తనూజ ను నామినేట్ చేసేవాడిని, నా దగ్గర పాయింట్ ఉంది అన్నాడు. నామినేషన్స్ ముగిసాక వాష్ రూమ్ దగ్గర తనూజ, ఇమ్మాన్యువల్ ఇద్దరూ బాగా గొడవపడ్డారు. నువ్వు అందరిని అడ్డం పెట్టుకుని అడావు అంటూ ఇమ్ము తనూజ ను అన్నాడు, తనూజ కూడా ఇమ్మాన్యువల్ నువ్వు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావ్, కొత్తవాళ్లతో కలిసి నన్ను సీరియల్ నటి అన్నావ్.
నేను గనక ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే.. తర్వాత నన్ను నామినేట్ చేసుకో అంటూ తనూజ తో ఇమ్మాన్యువల్ ఇద్దరూ ఓ రేంజ్ లో గొడవపడ్డారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.