అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సమంత కు విడాకులిచ్చాక మరో హీరోయిన్ శోభిత తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో గత ఏడాది డిసెంబర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. శోభిత అక్కినేని ఫ్యామిలీలో అందరితో కలిసి పోవడమే కాదు మామగారు నాగార్జునతో ప్రత్యేక అనుబందాన్ని మైంటైన్ చేస్తుంది.
ఎంతగా అంటే తనకు కూతురు లేని లోటు శోభిత తీరుస్తుంది అనేంతగా నాగార్జున శోభిత గురించి మాట్లాడుతున్నారు. ఇక పెళ్ళికి ముందే గత ఏడాది అక్కినేని ఫ్యామిలీతో దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్న శోభిత.. ఈ ఏడాది అఫీషియల్ కోడలిగా అక్కినేని ఇంట శోభిత ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది.
పెళ్లి తర్వాత వచ్చిన తొలి దీపావళిని నాగ చైతన్య తన భార్య శోభిత తో కలిసి సెలెబ్రేట్ చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. చైతు-శోభిత ఫెస్టివ్ లుక్ లో కనిపించి అభిమానులను కనువిందు చేసారు.
అలాగే ఇద్దరూ చేతుల కలిపి, వెలికి ఉంగరం హైలెట్ అయిన ఫొటోతో పాటుగా దీపావళి రంగోలి పిక్స్ ని చైతు-శోభితలు షేర్ చేసారు.