బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిల్లో అయేషా, రమ్య లు ఎక్కువగా తనూజ ని టార్గెట్ చేస్తున్నారు. తనూజ భరణి ని నాన్న నాన్నా అంటూ అతని ఆటకి ఎఫక్ట్ అయ్యింది, అంతేకాదు కళ్యాణ్, తనూజ తో క్లోజ్ గా ఉండడం పై తనూజ ని టార్గెట్ చేస్తూ గత వారం అయేషా తనూజ ను, ఈ వారం రమ్య తనూజ ని నామినేట్ చేసారు.
ఏ ఎపిసోడ్ లోను తనూజ కళ్యాణ్ కోసం పాకులాడలేదు. కళ్యాణ్ వచ్చి తనూజ ను కెలకడం తప్పితే ఎక్కడా తనూజ తప్పు కనిపించలేదు ఆడియన్స్ కి. అందుకే ఆమెను అందరూ ఇష్టపడుతున్నారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీస్ మాత్రం తనూజ కళ్యాణ్ ని బాయ్ ఫ్రెండ్ గా చేసుకుని, భరణి ని నాన్న గా చేసుకుని ఫైనల్ వరకు వెళ్లాలని ట్రై చేస్తుంది అంటూ ఆమెను పాయింట్ అవుట్ చేస్తున్నారు.
కానీ తనూజ మాత్రం అయేషా, రమ్యలకు ఇద్దరికి కలిపి ఇచ్చిపడేసింది. రమ్య నామినేట్ చేస్తూ.. నువ్వు ముసుగులో ఉన్నావ్, నువ్వొక నటివి, భరణి గారు వెళ్లిపోవడానికి నువ్వే కారణం, కళ్యాణ్ తో లవ్ వ్యవహారమంటూ ఏదేదో వాగింది. దానితో తనూజ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యింది. అసలే రమ్య, కళ్యాణ్ తో, మాధురి తో మాట్లాడిన వీడియోస్ చూసింది.
దానితో పచ్చళ్ళ పాప పై తనూజ రెచ్చిపోతూ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు.. కాదు ఒక్క వేలితో వేసే విజిల్ ఇంకా పవర్ ఫుల్ అంటూ తనూజ విజిల్ వేసి రమ్య కు దిమ్మతిరిగేలా చేసింది. దానితో పచ్చళ్ళ పాప మొహం మాడిపోయింది.