ప్రేమకథా చిత్రాల ఒరవడిని మార్చిన సినిమా... భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసిన గ్రేట్ మూవీ - `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మ్యూజికల్ హిట్ గురించి కథానాయకుడు షారూఖ్‌తో పాటు, కథానాయిక కాజోల్ ఎమోషనల్ గా స్పందించారు.
ఈ సినిమా ప్రపంచానికి భారతీయ సంస్కృతిని నేర్పించిందని ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నామని, లేదా ప్రేమలో పడ్డామని చెప్పిన జంటలు ఉన్నాయని ఖాన్ గుర్తు చేసుకున్నారు.
స్విట్జర్లాండ్ సహా యూకేలోని అందమైన లొకేషన్లలో `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (డిడిఎల్‌జే) తెరకెక్కింది. ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
నిజానికి దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ సినిమా కథను ఇండో- అమెరికన్ ప్రేమకథగా రూపొందించారు. ఇందులో టామ్ క్రూజ్ నటిస్తే బావుంటుందని భావించారు. కానీ నిర్మాత యష్ చోప్రా స్క్రిప్టు విన్న తర్వాత దీనిని ఇద్దరు భారతీయ ఎన్నారైల ప్రేమకథా చిత్రంగా మార్చాలని సూచించారు. ఆ తర్వాత షారూఖ్ తో అది వర్కవుటైంది.