టాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ వెండితెరకు పరిచయం అయ్యారు. చరణ్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగచైతన్య, అఖిల్ ఇప్పటికే స్టార్లుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అఖిల్ ఇంకా సక్సెస్ తో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా హీరో అయ్యాడు. త్వరలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ నటవారసులు తేజస్వి, మోక్షజ్ఞ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారని కథనాలు వచ్చాయి.
ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షద కూడా సినీరంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది. మహాధన్ తండ్రి బాటలోనే మొదట దర్శకత్వ శాఖలో పని చేస్తున్నాడు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమాకి అతడు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
దర్శకత్వ శాఖలో అనుభవం ఘడించి దర్శకుడిగా సెటిలవుతాడా? లేక కథానాయకుడిగా మారతాడా? అన్నదానిపై ఇప్పటికి ఇంకా స్పష్ఠత లేదు. మహాధన్ ప్లానింగ్స్ గురించి రవితేజ కూడా ఓపెన్ కాలేదు ఇంకా. మరోవైపు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పని చేయడం ద్వారా సినీనిర్మాణ రంగంలో రవితేజ కుమార్తె మోక్షద అనుభవం ఘడించనుంది.