బిగ్ బాస్ సీజన్9 లోకి టార్గెట్ తనూజ తో దిగారు అయేషా, రమ్య లు. బయట తనూజ కు బాగా సపోర్ట్ ఉండడంతో ఆమెకు ఆడియన్స్ ఓట్స్ వేస్తున్నారు. అది చూసిన రమ్య, అయేషా లు పర్సనల్ గా తనూజ ను హౌస్ లో నామినేషన్స్ లో టార్గెట్ చేస్తున్నారు. గత వారం అయేషా నువ్వు ఓ బాయ్ ఫ్రెండ్, నాన్న అంటూ ఫైనల్ కి వెళ్లిపోదామనుకుంటున్నావు అంది. దానికి తనూజ గట్టిగానే ఇచ్చిపారేసింది.
ఈరోజు సోమవారం నామినేషన్స్ లో రమ్య కూడా తనూజ ను టార్గెట్ చేసింది. నువ్వు డ్రామా క్వీన్ వి, నువ్వొక ముసుగులో ఉన్నావ్, అక్కడినుంచి బయటికి రా.. నువ్వు నటిస్తున్నావ్, నువ్వు ఫేక్ అంటూ రమ్య తనూజ ను నామినేట్ చేసింది. దానికి తనూజ నువ్వు డ్రామా క్వీన్ అనుకో నటన అనుకో ఏదైనా అనుకో నీ ఏజ్ కి తగ్గట్టు మాట్లాడు అనగానే రమ్య నువ్వు ఏజ్ లో పెద్దదానికి నువ్వు మనుషులను పంపించేసే దేవతవి అంది, అవును నేను దేవతనే ఇది నా గేమ్ నువ్ పోవమ్మా అంటూ తనూజ గట్టిగానే రియాక్ట్ అయ్యింది.
అలాగే రీతూ రాముని నామినేట్ చేసింది.. రాముకి రీతూ కి మద్యన గొడవ జరిగింది. దివ్య వైల్డ్ కార్డు సాయి ని నామినేట్ చేస్తే నువ్వు ఇక్కడ ఫ్యామిలీ డ్రామా నడిపావు, ఒక వ్యక్తిని పైనుంచి కింది పడేసి ఎలిమినేట్ అయ్యేలా చేసావు అని సాయి అనగానే నా వల్ల భరణి గారు ఎలిమినేట్ అయ్యారని ఎవరినైనా చెప్పమను అంటూ గొడవపడిన ప్రోమో హైలెట్ అయ్యింది