ఒకప్పుడు చాలామంది నటుడిగా యాక్సెప్ట్ చెయ్యని హీరో ధనుష్. కానీ తన నటనతో అందరిని అనుమానాలను అభిప్రాయాలను చుట్ట చుట్టి చెత్తకుప్పలో వేసేలా అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ గా అందరి గుండెల్లో నిలిచిపోయాడు. అదే మాదిరి దర్శకుడైన ప్రదీప్ రంగనాధన్ లవ్ టుడే తో హీరోగా మారి అందరిని మెప్పించాడు.
కానీ ప్రదీప్ రంగనాధన్ హీరో అంటే చాలామంది యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇతనేమిటి హీరో ఏమిటి, ప్రదీప్ అసలు హీరో మెటీరియల్ కాదు అన్నారు. కానీ తన కామెడీ టైమింగ్స్ తో, నటనతో ప్రదీప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లవ్ టుడే నే కాదు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తోనూ సత్తా చాటారు. ఇప్పుడు ఈ దీపావళి కి డ్యూడ్ అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు. క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా ఆడియన్స్ మాత్రం డ్యూడ్ కి హిట్ టాక్ ఇవ్వడంతో డ్యూడ్ తోనూ ప్రదీప్ రంగనాధన్ హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ సాధించడం చూసిన వారు ఈ బక్క హీరోకి అలా కలిసొస్తుంది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.