Advertisement
Google Ads BL

షాకింగ్: న‌టుడి శ‌రీరంపై 119 కుట్లు


బ్రూస్ లీ, జాకీ చాన్, టామ్ క్రూజ్, డేనియ‌ల్ క్రెయిగ్ (జేమ్స్ బాండ్ 007) లాంటి కొంద‌రు స్టార్లు రిస్కీ స్టంట్స్ తో శ‌రీరంలోని బొమిక‌ల్ని ఇర‌గ్గొట్టుకోవ‌డంపై ఎన్నో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగు చూసాయి. కొంద‌రు హీరోలు సాహ‌సాల‌కు వెన‌కాడ‌రు. రిస్కు ఎంత ఉన్నా డూప్ లేకుండా ఫైట్లు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. భ‌యాన్ని ద‌రి చేర‌నివ్వ‌క సాహ‌సాలు చేస్తే, దాని ప‌ర్య‌వ‌సానం కూడా అంతే దారుణంగా ఉంటుంది.

Advertisement
CJ Advs

హాలీవుడ్ స్టార్ల రేంజులో కాదు కానీ, మ‌న‌కు కూడా చాలా రిస్కులు చేసేందుకు వెన‌కాడ‌ని యాక్షన్ హీరోలు ఉన్నారు. తెలుగువాడు, కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ ఇలాంటి సాహ‌సాలకు అస్స‌లు వెన‌కాడ‌రు. రిస్కీ స్టంట్స్ చేయాల్సి ఉన్నా డూప్ ని ఉప‌యోగించేందుకు అత‌డు ఇష్ట‌ప‌డ‌డు. త‌న 21 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ డూప్ ల‌ను ఉప‌యోగించ‌లేదని, రిస్కు ఎంతైనా తానే ఎదుర్కొన్నాన‌ని విశాల్ తాజా పాడ్ కాస్ట్ లో వెల్ల‌డించాడు. ఇటీవ‌ల `యువ‌ర్స్ ఫ్రాంక్లీ విశాల్` పేరుతో పాడ్ కాస్ట్ లో చేరిన విశాల్ ఇలాంటి క‌ఠిన‌మైన విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నాడు. 

అత‌డు త‌న సుదీర్ఘ‌మైన కెరీర్ లో ఏనాడూ బాడీ డ‌బుల్ ని ఉప‌యోగించ‌నందున శ‌రీరంలో ఇప్ప‌టివ‌ర‌కూ 119 కుట్లు ప‌డ్డాయ‌ని  చెప్పాడు. అత‌డు చెప్పిన విష‌యం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విశాల్ వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. విశాల్ ఇటీవ‌లే సాయి ధ‌న్షిక‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లితో ఒక‌టి కానున్నారు. `మ‌ద‌గ‌ద‌రాజా` త‌ర్వాత అత‌డు న‌టించిన `మగుధం` వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Actor Vishal Reveals 119 Stitches on Body:

Vishal admits he has 119 stitches all over his body in new post promoting podcast
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs