బిగ్ బాస్ సీజన్ 9లో బ్లండర్ మిస్టేక్ ఏమైనా ఉంది అంటే అదే శ్రీజ దమ్ము ఎలిమినేషనే అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. గత వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయిన శ్రీజ దమ్ము నే కాదు హౌస్ మేట్స్, అభిమానులు అందరూ షాకయ్యారు. అయితే ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చిన శ్రీజ చాలా మౌనంగా, తల ఎత్తకుండానే ఇంటికెళ్ళిపోయింది.
శ్రీజ దమ్ము ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా శ్రీజ దమ్ము మాత్రం కామ్ గానే ఉంది. కానీ తాజాగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. అది కూడా ఎమోషనల్ అవుతూ శ్రీజ ఆ వీడియో వదిలింది. నేను ఏం తప్పు చేశాను అని నన్ను ఎలిమినేట్ చేసారో అర్ధమవ్వలేదు. కనీసం నా జర్నీ ప్రోమో కూడా వెయ్యలేదు. నాకు అస్సలు లక్కు లేదు.
హౌస్ లో ఎవరి సపోర్ట్ లేదు. నేను టాప్ 5 వరకు ఉంటాను అనుకున్నాను, నా పేరెంట్స్ ని నేను హౌస్ లో చూస్తాను అనుకున్నాను, నా తల్లితండ్రులు రాసిన లెటర్ కూడా చదవలేకపోయాను. దివాళి ఎపిసోడ్ ని ఆది గారు చెప్పే కామెంట్స్ ని బాగా మిస్ అవుతున్నాను, బిగ్ బాస్ ను అయితే ఇంకా ఇంకా మిస్ అవుతున్నాను అంటూ శ్రీజ ఎమోషనల్ అవడంతో ఆమె అభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు.