ఈ దీపావళి కి ప్రేక్షకుల్లో హోప్స్ పెంచుతూ.. నలుగురు హీరోలు భారీ ప్రమోషన్స్ తో తాము నటించిన సినిమాలను దివాళి ముందు ఆడియన్స్ ముందుకు తీసుకోచ్చారు. ముందుగా ప్రియదర్శి మిత్రమండలి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాని విపరీతంగా ప్రమోట్ చేసారు, కాన్ఫిడెంట్ గా ముందుగానే ప్రీమియర్స్ వేశారు. కానీ మిత్రమండలి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ ఆకట్టుకోలేదు.
ఆతర్వాత సిద్దు జొన్నలగడ్డ, ప్రదీప్ రంగనాధన్ లు పోటీపడ్డారు. ఒకే రోజు తెలుసు కదా, డ్యూడ్ విడుదలకగా.. తెలుసు కదా సో సో టాక్ తో సరిపెట్టుకోగా.. డ్యూడ్ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. డ్యూడ్ కాస్త ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. కానీ ఆ సినిమాకి ఓపెనింగ్స్ లేవు. రెండోరోజు నుంచి మొదలైంది.
ఆతర్వాత రోజు దివాళి బరిలో కిరణ్ అబ్బవరం దిగాడు. నిన్న శనివారం విడుదలైన కిరణ్ అబ్బవరం K -ర్యాంప్ తో ర్యాంప్ ఆడిస్తాడని అనుకున్నారు. కిరణ్ కూడా అదే కాన్ఫిడెంట్ తో టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్ళమన్నాడు. అయితే K -ర్యాప్ కి సో సో టాక్ వచ్చింది. తెలుసు కదా, K -ర్యాంప్ రెండు ఒకేవిధమైన టాక్ ని సొంతం చేసుకున్నాయి.
కానీ K-ర్యాంప్ టాక్ కి, రేటింగ్స్ తో సంబంధం లేకుండా థియేటర్ లలో పికప్ అవుతుంది. కానీ ఆడియన్స్ అనుకున్న అంచనాలు ఏ సినిమా అందుకోలేకపోయింది. గత పది రోజులుగా ప్రమోషన్స్ లో ఊరించి ఊరించి నలుగురు హీరోలు బ్లాక్ బ్యస్టర్ ఇవ్వకుండా ఉసూరుమనిపించారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.