ప్రస్తుతం ఇటర్నేషనల్ లెవల్ హీరోగా అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 చిత్రం చేస్తున్నారు. పుష్ప సీరీస్ తో నేషనల్ వైడ్ టాప్ లోకి వెళ్ళిపోయినా అల్లు అర్జున్ ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ఆలోచనలే చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ లో అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్ లోనే కనిపిస్తున్నారు.
అందులోను అట్లీ తో చేస్తున్న మూవీకి అల్లు అర్జున్ 175 కోట్ల పారితోషికంతో చరిత్ర సృష్టించబోతున్నారనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత ఓ కుర్ర హీరోనే అంటూ నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత రాత్రి బండ్ల గణేష్ తన ఇంట్లో దివాళి పార్టీ ఇచ్చారు. ఈ దివాళి సెలెబ్రేషన్స్ లో టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జా, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో బండ్ల గణేష్.. మిరాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జా గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తదుపరి అల్లు అర్జున్.. తేజ సజ్జా నే అంటూ బండ్ల గణేష్ చెప్పగానే ఆ ఈవెంట్ కి హాజరైన వారంతా చప్పట్లు కొట్టడం విశేషం, ఆ ఈవెంట్ లో బండ్ల చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనం అయ్యాయి.