హీరో నితిన్ ప్రయత్న లోపమో, కథల ఎంపికలో లోపమో, దర్శలను ఎంచుకోవడంలో లోపమో తెలియడం లేదు. ఆయన వరస సినిమాలు, దానికొస్తున్న రిజల్ట్ చూస్తే నితిన్ ఎప్పటికి కోలుకోవాలి, ఎప్పటికి సక్సెస్ ట్రాక్ లోకి రావాలి. నితిన్ చేస్తున్న చిత్రాలన్నీ ప్లాప్ లు కాదు డిజాస్టర్ అనాల్సిందే.
ఒకటా రెండా కొన్నేళ్లుగా నితిన్ కి సక్సెస్ రావడం లేదు. ఇప్పుడు నితిన్ పలు ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటున్నాడనే న్యూస్ ఆయన అభిమానులను కలవరపెడుతుంది. ఎల్లమ్మ, అలాగే శ్రీను వైట్ల తో కమిట్ ఆయిన మూవీ ని ఆపెయ్యడం, ఇలా నితిన్ ముందు అనుకున్న చిత్రాల నుంచి తప్పుకుంటున్నాడనే వార్త వైరల్ అవుతుంది.
అయితే నితిన్ కొద్దిగా బ్రేక్ తీసుకుని ఫ్రెష్ గా మూవీ చెయ్యాలని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు తప్పెక్కడ జరుగుతుంది, కథలు ఎలాంటివి ఎంచుకుంటే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తామనే విషయంలో నితిన్ కాస్త సమయం తీసుకుని పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అంటున్నారు. అయితే నితిన్ ఫెయిల్యూర్స్ వెనుక తప్పు అతనొక్కడిదే కాదు దర్శకుల లోపం కూడా ఉంది. ఆ విషయంలోనూ నితిన్ ఆలోచించాల్సిన సమయం అవచ్చింది మరి.
చూద్దాం నితిన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది. ఏ దర్శకుడిని ఎంచుకుని ఎలాంటి కథతో వస్తాడు అనేది.