గత వారం బిగ్ బాస్ సీజన్ 9 లో శ్రీజ ఎలిమినేష్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ జరిగిందో అందరూ చూసారు. ఇక ఈవారం అసలు నమ్మలేని కంటెస్టెంట్, హౌస్ లో టాప్ 5 లో ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం బుల్లితెర ప్రేక్షకులకు ఒకరకంగా షాకింగ్ విషయమే అని చెప్పాలి.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తనూజ, సుమన్ శెట్టి, డిమోన్ పవన్, భరణి, దివ్య, రాము రాధోడ్ లలో తనూజ కు ఆడియన్స్ సపోర్ట్ వోటింగ్ లో స్పష్టంగా కనిపించింది. ఆతర్వాత డీసెంట్ గా సుమన్ శెట్టి నిలిచాడు. మూడో స్థానంలో డిమోన్ పవన్ ఉండగా.. నాలుగో స్థానంలో దివ్య ఉంది.
ఇక రాము రాధోడ్, భరణిలు ఇద్దరూ డేంజర్ జోన్ లో గా నిలవగా.. ఈ వారం భరణి ఎలిమినేట్ అయ్యాడు అని బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి. మొదటి రెండు వారాలు బాగా ఆడిన భరణి తర్వాత తనూజ, దివ్య మధ్యలో అంటే బంధాలకు బానిసై అందరికి టార్గెట్ అయ్యాడు. ఎంతగా అంటే బుల్లితెర ప్రేక్షకులు మిమ్మల్ని హౌస్ లో ఎందుకుంచాలి అనే విధంగా.
ఇక ఈ వారం ఓటింగ్ లో లీస్ట్ ఉండడంతో భరణి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. మరి స్ట్రాంగ్, టాప్ 5 అనుకున్న కంటెస్టెంట్ హౌస్ ను వీడడంతో మిగతా హౌస్ మేట్స్ షాక్ లో ఉండిపోయారట.