పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే అభిమానులకు కడుపు నిండిపోతుంది. ప్రభాస్ ఇప్పుడు సినిమాలను వరసగా సెట్ పైకి తీసుకేళ్లడమే కాదు ఒకేసారి రెండు సినిమాలు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ రెండు చిత్రాలను ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు. ఆతర్వాత స్పిరిట్ చేస్తారు. అది పూర్తి కాగానే కల్కి 2, సలార్ 2 చిత్రాలు చెయ్యాల్సిన ప్రభాస్ లైనప్ లోకి మరిన్ని ప్రాజెక్ట్ వచ్చి చేరాయి.
అందులో హను రాఘవపూడి దర్శకత్వంలోనే ఫౌజీ ప్రీక్వెల్, ప్రశాంత్ వర్మ తో ఓ ప్రాజెక్ట్, రాజా సాబ్ 2 ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా ప్రభాస్ ఓ ఆరేడేళ్లు అసలు ఖాళీ లేకుండా సినిమాలు ఒప్పెసుకుని.. వరసగా అన్ని ఇలా చేతిలో పెట్టుకోవం అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది.
మరోపక్క ప్రభాస్ తో హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ లో3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రభాస్ లైనప్ లో భాగమే. వచ్చే ఏడాది ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఈ బర్త్ డే కి ప్రభాస్ నుంచి రాబోయే సర్ ప్రైజ్ లపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.