గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి కి రేషన్ మేనేజర్ దివ్య కు అస్సలు పొసగడం లేదు. మాధురి ని కుకింగ్ హెడ్ గా పెట్టాక ఆమెకు రేషన్ మేనేజర్ గా ఉన్న దివ్య కి మధ్యన గొడవ జరుగుతూనే ఉంది. ఎగ్ దోసలో కర్రీ వేసుకుని తినడంతో దివ్య నన్ను అడగకుండా ఎలా తింటారని మాధురి తో గొడవ పడింది. మాధురి కూడా దివ్య ను రేషన్ మేనేజర్ గా తీసెయ్యమని కెప్టెన్ తో చెప్పింది.
అయితే ఈ శనివారం నాగార్జున ఎపిసోడ్ లో దివ్య ని, మాధురి నించోబెట్టి క్లాస్ తీసుకున్నారు. దివ్య నీకు ఇష్టమైన వాళ్లకు ఫుడ్ ఎక్కువ పెడుతున్నావ్ అని నాగ్ అంటే అది నా ఫుడ్ సర్, నేను ఎవ్వరికైపెట్టుకుంటాను అంది, మాధురి చాలా కొద్దిగా కూర తీసుకుంది అంతేకదా అంటే అవును సర్ నన్నడగాలి కదా అంది.
రేషన్ మేనేజర్ డివైడ్ చేసేవరకు రూల్స్ ఉన్నాయని వైల్డ్ కార్డ్స్ కి తెలియదు అని నాగార్జున అన్నారు. దివ్య భరణి గారికి కర్రీస్ అవి ఎక్కువ పెడుతుంది అనింది మాధురి. నా పోర్షన్ ఫుడ్ నేను ఎవ్వరికైనా పెట్టుకుంటాను అంది దివ్య.. నేను ఐదు ప్రశ్నలు అడుగుతాను, అవన్నీ మ్యాచ్ అయితే రేషన్ మేనేజర్ ని చేంజ్ చేస్తాము అన్నారు నాగ్.. ఇవి ఈరోజు ఎపిసోడ్ కొత్త ప్రోమో హైలైట్స్ .