హిందీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ కోసం పరితపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ తో కలిసి నటించిన దే దే ప్యార్ దే 2 చిత్రం ప్రమోషన్స్ లో గ్లామర్ షో చేస్తూ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. రీసెంట్ గా దే దే ప్యార్ దే 2 ట్రైలర్ లాంచ్ లో రెడ్ మోడ్రెన్ డ్రెస్ లో అందాలు చూపిస్తూ మతిపోగొట్టింది.
దే దే ప్యార్ దే 2 ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రెస్ లో అద్దరగొట్టేస్తుంది. రకుల్ ఏదైనా బాలీవుడ్ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యిందా అనేలాంటి లుక్ తో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. ఇక దివాళి బాష్ లో లైట్స్ నడుమ వైట్ మోడ్రెన్ వేర్ లోను రకుల్ లుక్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రకుల్ ప్రీత్ తాజాగా ఈ బ్లాక్ డ్రెస్ అండ్ వైట్ డ్రెస్ లుక్ ని షేర్ చేసింది. ఇక సౌత్ కి దూరమైన రకుల్ హిందీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ రకుల్ ని శాటిస్ ఫై చేసే సక్సెస్ మాత్రం ఇప్పటివరకు అందలేదు. మరి ఇప్పుడు దే దే ప్యార్ దే అయినా రకుల్ ని ఆదుకుంటుందేమో చూడాలి.