బిగ్ బాస్ సీజన్9 లో 6 వ వారం పూర్తి కాబోతుంది. గత వారం ఫ్లోరా ఎలిమినేట్ తర్వాత డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీజ ను ఎలిమినేట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో శ్రీజ కు స్టాండ్ తీసుకుంటూ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అందరూ గోల గోల చేసారు. శ్రీజ ఇప్పుడే ఎలిమినేట్ అవ్వాల్సి కాదు అన్నారు.
ఇక ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీస్ పెట్టిన చిచ్చు తో టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. అందులో తనూజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత, డిమోన్ పవన్, రాము రాధోడ్ ఉన్నారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి సుమన్ శెట్టి, నిఖిల్ ఇద్దరూ హౌస్ లో కెప్టెన్స్ అయ్యారు,
అయితే రేపు ఆదివారం ఎలిమినేట్ అయ్యే వారిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కారణం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడమే. అందులో ఈ వారం ఓటింగ్ లో తనూజ, సుమన్ శెట్టి పోటాపోటీగా ఓట్లు కొల్లగొడుతూ.. తనూజ, సుమన్ శెట్టి రోజుకొకరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నారు. ఫైనల్ గా తనూజ నే టాప్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి ఉన్నాడు.
ఆ తర్వాత స్థానంలో డీమాన్ పవన్‌కు 15 శాతం ఓటింగ్, దివ్య నిఖితకు 11 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక చివరి రెండుస్థానాల్లో భరణి 10 శాతం, రాము రాథోడ్ 10 శాతంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి ఈ వారం భరణి, రాము లలో ఎవరు ఎలిమినేట్ అయినా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటికెళ్ళిపోయినట్లే.