వేణు బలగం చిత్రం సక్సెస్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సతమతమవుతున్నాడు. కారణం ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి హీరోలు వెళ్లిపోతున్నారు. ముందు అనుకున్న హీరో నాని. ఆయన ఎల్లమ్మ నుంచి తప్పుకోవడం, ఆతర్వాత ఆ ప్లేస్ లోకి హీరో నితిన్ వచ్చాడు. తమ్ముడు ఎఫెక్ట్ తర్వాత నితిన్ ఎల్లమ్మ నుంచి సైడ్ అయ్యాడు.
ఆ తర్వాత ఎల్లమ్మ హీరోగా శర్వానంద్ పేరు వినిపించింది. ఆ నెక్స్ట్ కిష్కిందపురి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు ఎల్లమ్మ లో కీలక పాత్ర అంటూ న్యూస్ స్టార్ట్ అయ్యింది. దేవిశ్రీ కి జోడిగా మహానటి కీర్తి సురేష్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
ఇంతకుముందు ఎల్లమ్మ టైటిల్ రోల్ నుంచి కీర్తి సురేష్ కూడా తప్పుకుంది అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో పాటుగా అదే దిల్ రాజు బ్యానర్ లోనే వేణు దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన ఎల్లమ్మ ప్రాజెక్ట్ చేసేందుకు కీర్తి సురేష్ రెడీ అవుతుంది అంటూ సమాచారం అందుతుంది.