Advertisement
Google Ads BL

బిగ్ బాస్ పై హరితేజ హాట్ కామెంట్స్


ఎన్టీఆర్ హోస్ట్ గా సౌత్ లో అందులోను తెలుగులో మొదలైన బిగ్ బాస్ సీజన్ 1 చూసిన వాళ్ళు మిగతా సీజన్స్ చూసేందుకు అంతగా ఇష్టపడడం లేదు. సీజన్ 1 లో ఎన్టీఆర్ హోస్ట్, ఆతర్వాత అందులోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ నచ్చడం ప్లస్ అయ్యింది. అంత ఆదరణ మరో సీజన్ కి రాలేదు అనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

అయితే సీజన్ 1 లో టాప్ 5 కి వెళ్లిన హరితేజ.. ఆ సీజన్ లో హరికథ తో చాలా బాగా ఆకట్టుకుంది. ఆతర్వాత ఎనిమిదో సీజన్ లోకి హరితేజ ఎంట్రీ ఇచ్చి ఎనిమిది వారాలు హౌస్ లో ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో హరితేజ ను బిగ్ బాస్ గురించి ప్రశ్నిస్తూ.. మీరు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు ఎందుకు హౌస్ లోకి వచ్చానా అని ఎప్పుడైనా అనుకున్నారా అని అడిగితే.. 

బిగ్ బాస్ సీజన్ 1 లో అన్ని వారాలు ఉన్నా అస్సలు అలాంటి ఫీలింగ్ రాలేదు. కానీ సీజన్ 8లో మాత్రం ప్రతిరోజూ ఎందుకు వచ్చానా అని ఫీలయ్యాను అంటూ బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 1కి సీజన్ 8 మధ్య చాలా మార్పులు వచ్చాయి. నేను పాల్గొన్న సీజన్ 8 తర్వాత బిగ్ బాస్ ఇకపై చూడొద్దని ఫిక్స్ అయ్యాను. 

అసలు ఆ షో మీద ఆసక్తి పూర్తిగా పోయింది, మళ్ళీ బిగ్ బాస్ కి వస్తారా అని అడిగితే వారికి ఓ దణ్ణం పెడతాను అంటూ హరితేజ బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Hari Teja hot comments on Bigg Boss:

Hari Teja sensational comments on Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs