కిరణ్ అబ్బవరం మరోసారి దీపావళిని టార్గెట్ చేసాడు. గత ఏడాది క హిట్ సెంటిమెంట్ ని ఈ ఏడాది కంటిన్యూ చెయ్యాలని నమ్మకంగా ఉన్నాడు. K-ర్యాంప్ ప్రమోషన్స్ ట్రైలర్, పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. నేడు అక్టోబర్ 18 ప్రేక్షకుల ముందుకు వచ్చిన K-ర్యాంప్ ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.
K-ర్యాంప్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే... అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ K-ర్యాంప్. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంది. కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫస్టాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బావుంది అంటూ కొంతమంది ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు.
స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లేతో ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. కాలేజీ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించారు. సెకండాఫ్ లో నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. క్లైమాక్స్‌లో మెసేజ్ బావుంది.. అంటూ మరికొందరు ప్రేక్షకులు చెబుతున్న మాట. ఎగ్జామ్ ఎపిసోడ్, రెడ్ షీట్ ఎపిసోడ్స్ హైలెట్. ఇంటర్వెల్ బ్లాక్ టెర్రిఫిక్. ఓవరాల్‌గా డీసెంట్ ఎంటర్‌టైనర్.. అంటూ K -ర్యాంప్ వీక్షించిన ఓవర్సీస్ ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్.
మరి అసలు K -ర్యాంప్ కథ ఏమిటి, సినిమాలో ఎంత విషయముంది అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..